తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి-మంత్రులు నారాయణ,ఆనం
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి సకల శుభాలు అందించాలని రాష్ట్ర మంత్రులు, డా.పొంగూరు.నారాయణ,ఆనం రామనారాయణరెడ్డిలు ఆకాంక్షించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకుని మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి అన్నదాతలు పాడి పంటలు,బోగ భాగ్యాలు,సిరి సంపదలతో తుల తూగాలని, అందరి కుటుంబాలలో ఆనందం వెల్లి విరియాలని రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ హిమాన్షు శుక్ల హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఏడాది జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు మరియు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు:- ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందుతూ, ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహం, ఆనందం తీసుకురావాలని కోరారు.

