తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం
తిరుపతి: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు టీటీడీ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగిందన్నారు. టీటీడీ నిధులతో ఆలయంతో పాటు పుష్కరిణిని కూడా సుమారు రూ.19 కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. వచ్చే మహాశివరాత్రి నాటికి పనులన్నీ పూర్తి అయ్యేలా కార్యచరణ చేసుకోవడం జరిగిందని తెలిపారు. పునర్నిర్మాణానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చిన టిటిడి చైర్మన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
15వ శతాబ్దం నాటిది:- చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిద్దేశ్వర స్వామి ఆలయం 15వ శతాబ్దం నాటిది అని ఈ గుడిలో గత పాలకులు ఎందరున్నా కూడా మారుమూల ప్రాంతం అయినందున అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయవలసినదిగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లామని, వారు స్పందించి వెంటనే నేడు ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. రానున్న మహాశివరాత్రి నాటికి ఆలయ పనులు అన్ని పూర్తి అవుతాయని అన్నారు.
తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులలో భాగంగా సోమవారం భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ టిటిడి బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడు, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని తో కలిసి పాల్గొన్నారు.