తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేవి రంగవల్లులు-కలెక్టర్
నెల్లూరు: తెలుగు వారు ఎక్కడ వున్న పండుగల సమయంలో తమ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రంగవల్లులను తీర్చిదిద్దుతారని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు.సోమవారం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్యర్యంలో నగరంలోని వి.ఆర్.సి మైదానంలో నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో దాదాపు 200 మహిళలు పాల్గొనడం అబినందనీయమని కలెక్టర్ అన్నారు.మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లుల్లో మొదటి,ద్వితీయ,తృతీయ బహుమతులు పొందిన వారికి బహుమతులు అందచేశారు.ఈకార్యక్రమంలో నెల్లూరు ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ,ఎడిషన్ ఇన్ చార్జీ రామకృష్ణ,సర్కులేషన్ మేనేజర్ నాగేశ్వరావు,అడ్వటేజ్ మెంట్ ఇన్ చార్జీ రహీం,సినియర్ సబ్ ఎడిటర్ కేశవులరెడ్డి,చంద్రశేఖర్, వెంకట్రావు, కిషోర్,ఫోటో గ్రాఫర్ జాకీర్,జిల్లాకు సంబంధించిన రిపోర్టలు,ఎడిటర్లు,తదితర సిబ్బంది పాల్గొన్నారు.

