నగరపాలక సంస్థలో రెవెన్యూ అధికారులు బదలీలు
నెల్లూరు: నగరపాలక సంస్థలో పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ విభాగంలోని రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను, బదిలీ చేస్తూ ఉత్తర్వులను కమిషనర్ సూర్యతేజ శనివారం జారీ చేశారు. R.Oలుగా ఉన్న S.A. సమద్, V.రాజేశ్వరిలను హెల్త్ సెక్షన్ శానిటరీ సూపర్వైజర్ లుగా బదిలీ చేశారు..మరో R.O.P.శ్రీనివాసులును రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ గా బదిలీ చేశారు.. మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నH.ఇనాయతుల్లా కు అదనంగా రెవెన్యూ అధికారిగా నియమించారు..రెవెన్యూ ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న V. పద్మావతి ని ఇంజనీరింగ్ విభాగానికి సూపరింటెండెంట్ గా బదిలీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లుగా విధులు నిర్వహిస్తున్న C.H.కృష్ణంరాజు, K.కృపాకర్ రావు, I.చిన్న బాబులను హెల్త్ సెక్షన్ లోని శానిటరీ ఇన్స్పెక్టర్ లుగా బదిలీ చేశారు. M.D.అబ్దుల్ రహీంను జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం C.1గా బదిలీ చేశారు..R.Iలు A.సునీల్ కుమార్ ను ఇంజనీరింగ్ సెక్షన్ E2 క్లర్క్ గా, N.కృష్ణ కిషోర్ ను రెవెన్యూ సెక్షన్లో A1 క్లర్కుగా, C.H.రవి ను H3 & H 5 ఇన్చార్జిగా, S.అజయ్ ను టౌన్ ప్లానింగ్ విభాగం G1 క్లర్కుగా, Y.శ్రీనివాసులు ను టౌన్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులని జారీ చేశారు..రెవెన్యూ ఇన్స్పెక్టర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్న R.వంశీనాథ్ రెడ్డి, T.కార్తిక్ రెడ్డి, B.శ్రీ సందీప్, T.శరత్ బాబు, S.శ్రావణ్ కుమార్,G.లోకనాథం లను నియమించారు.