DISTRICTSPOLITICS

ప్రసన్న,ప్రశాంతిల మధ్య కోవూరులో రాజకీయ యుద్దం?

దిగజారి,బజారు పడుతున్న రాజకీయలు..

రాజకీయాల్లో కనీస విలువలు,,నైతిక నియమాలు రోజు రోజుకు దిగజారి బజారు పడుతున్నాయి..గత ప్రభుత్వం పాలన నుంచే రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత,కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగడం మొదలైయింది అని చెప్పుకోవచ్చు..చంద్రబాబు,లోకేష్,,పవన్ కళ్యాణ్ లను,,వారి కుటుంబ సభ్యులను సైతం గత పాలకులు అసెంబ్లీ సాక్షిగా దిగిజారిన విమర్శలు చేశారు..దింతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గత పాలక పార్టీని ఛీత్కరించుకున్నారు అనేందుకు తరువాత జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం..

ఈ  స్ఠాయిలో రాజకీయ రచ్చ జరిగిన తరువాత ఎమ్మేల్యే ప్రశాంతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఫిర్యాదుతో ప్రసన్నరెడ్డిపై చర్యలు ఏ రూపంలో వుండనున్నాయి? నియోజకవర్గం పరిధిలో గతంలో జరిగిన అనేక అవకతవకలపై ఎన్ని కేసులు నమోదు కానున్నాయి అనేది వేచి చూడాలి మరి…

నెల్లూరు: రాజకీయాల్లో అధికార పక్షం చేసే విధాన పరమైన తప్పులను,,నిశితంగా పరిశీలించి ప్రభుత్వం చేసిన తప్పులను లెక్కలతో సహా ప్రజలకు వివరించడం ప్రతిపక్ష పార్ఠీల బాద్యత..అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్దంగా గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ నాయకులు ఈ విషయంను జీర్ణియించుకోలేక,,వారి ప్రభుత్వమే అధికారంలో వుంది అనుకుని,, అధికారి పార్టీ ఎమ్మేల్యేలు,,నాయకులపైన,,వ్యక్తిగత విమర్శలు,,నీచమైన ఆరోపణలు చేస్తున్నరని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు..

ఈ ఉపొద్ఘతంకు నేపధ్యం… నెల్లూరుజిల్లా కొవూరు నియోజకవర్గం వేదికగా మారింది…. ప్రస్తుత ఎమ్మేల్యే వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి,,ఇదే నియోజక వర్గం మాజీ ఎమ్మేల్యే నల్లపురెడ్డి.ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య చోటు చేసుకున్న ఆవాంచనీయమైన రాజకీయ దుర్ఘటన..

ఎమ్మేల్యే వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి:- గత వారం టీడీపీ ఎమ్మేల్యే వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి ఒక సందర్బంలో మాట్లాడుతూ 2019-24 మధ్యలో కొవూరు వైసీపీ ఎమ్మేల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి,ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేసేవాడని,,అందుకే అయన్ను పర్సంటేజ్ ప్రసన్న అని ప్రజలు పిలిచే వారిని దెప్పి పొడించింది..

ఎమ్మేల్యే ప్రసన్న దూషణలు:- ఇందుకు ప్రతిగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పడుగుపాడులో వైపీసీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు..సమావేశంలో మహిళ ఎమ్మేల్యే సొదరి వరస అయ్యే ప్రశాంతిరెడ్డిపై, దిగిజారిన విమర్శలు చేశారు..

 ప్రశాంతిరెడ్డి నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు,,నువ్వు ఎక్కడక్కడ తిరిగావో అంటూ దారుణమైన పదజాలం ఉపయోగించారు.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను పెళ్లి చేసుకున్నారన్నారు.. వేమిరెడ్డి కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ వ్యాఖ్యనించారు..”పదేళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావ్‌ ప్రశాంతి” ? ప్రభాకర్‌రెడ్డికి ఒకటే చెబుతున్నా, నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్‌…జాగ్రత్తగా ఉండాలి నువ్వు…”ఇప్పటికే నిన్ను చంపడానికి రెండు సిట్టింగ్‌లు అయ్యాయి,,ఇందుకు సంబంధించి నా దగ్గర సమాచారం ఉంది” అంటూ దారుణంగా మాట్లాడారు..

ప్రసన్న ఇంటిపై ప్రశాంతి అభిమానుల దాడులు:- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో, సోమవారం రాత్రి ఆయన ఇంటిపై ఎమ్మేల్యే ప్రశాంతి, అభిమానులు 8.30 నుంచి 9 గంటల మధ్యలో దాడికి పాల్పడి కారు ధ్వంసం చేశారు.. ఇంటిలోకి వెళ్లి ఫర్నిచర్, కుర్చీలను విరగ్గొట్టారు.. కిటికీలు పగలగొట్టారు.. ఫర్నిచర్,,ఇతర వస్తువులు,,కార్లను ధ్వసం చేశారు.. దుస్తులను బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు.. దాడులు జరుగుతున్న సమయంలో ప్రసన్న ఇంటిలో లేడు..

టీడీపీ నాయకుల కుట్రే:- సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు అనిల్‌కుమార్‌యాదవ్, ఆనం విజయకుమార్‌రెడ్డి, మేరిగ మురళీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు..ఇదంతా టీడీపీ నాయకుల కుట్రే అని ఆరోపించారు.. వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్:- మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని అయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు..అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు.. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో… ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు..అయినప్పటికీ పొగరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు..మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.

నెల్లూరు: రాజకీయంగా ఎదుర్కోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఇలాంటి సంస్కార రహిత ప్రసన్నను ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నల్లరెడ్డి ప్రసన్న పై జిల్లా అడిషనల్ ఎస్పీ మంగళవారం ఫిర్యాదు చేశారు. మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, మమతారెడ్డి, శోభారాణి, అరుణమ్మ, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *