AGRICULTUREDISTRICTSOTHERS

పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు రూ.110.97 కోట్లు జమ-కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు: పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా నెల్లూరు జిల్లాలో1,95,866 మంది రైతుల ఖాతాల్లో రూ.110.97 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ మండలం పొట్టెపాలెం గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పీఎం కిసాన్ 22వ విడత కింద 1,63,125 మంది రైతులకు రూ.32.63 కోట్లు, అలాగే అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 1,95,866 మంది రైతులకు రూ.78.35 కోట్లు విడుదల అవుతున్నట్లు చెప్పారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.110.97 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు వివరించారు.

సోమశిల, కండలేరులో సుమారు 113 టీఎంసీల నీరు:- జిల్లాలో ఈ ఏడాది రైతులు ఎంత ధాన్యం అందించినా ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో సుమారు 113 టీఎంసీల నీరు సమృద్ధిగా నిల్వ ఉన్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో వర్షాలు తక్కువగా వచ్చినా కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే నీటిని నిల్వ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం సోమశిల, కండలేరు జలాశయాలు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులు చేపట్టడంతో రైతాంగానికి మేలు జరుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *