జగన్ పర్యటనలో ప్లకార్డులు,బ్యానర్లు,బైక్ ర్యాలీలు,గుంపులుగా వుండడం నిషేధం-ఇంచార్జ్ SP దామోదర్
పోలీసు ఆంక్షలు మీరితే కేసులు తప్పవు..
నెల్లూరు: ఈనెల 31వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని నెల్లూరు జిల్లా ఇంచార్జ్ SP దామోదర్ తెలిపారు..మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు..జగన్మోహన్ రెడ్డి ఉదయం 10.30 నుండి 11 లోపల జైలు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని అక్కడనుండి సెంట్రల్ జైల్లో వున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో ములాఖత్ అవుతారని తెలిపారు..హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉందని, ముగ్గురు మత్రమే ములాఖాత్ కు వెళతారని వెల్లడించారు..అక్కడ నుండి కొండాయపాలెం గేట్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళతారన్నారు..ఈ సమయంలో జగన్ కాన్వాయ్ తో పాటు మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు..ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద 100 మందికి మాత్రమే అనుమతి ఉందని,, ఈ ప్రాంతం ప్రత్యేక జోన్ గా గుర్తించి హాస్పిటల్ వద్ద నుండి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు..జగన్ పర్యటన సమయంలో నెల్లూరులో 30 యాక్ట్ అమలులో ఉంటుంది కాబట్టి బైక్ ర్యాలీలు,బల ప్రదర్శనలు,కారు ర్యాలీలు,ప్లకార్డు ప్రదర్శన లు,గుంపులుగా వుండడం లాంటివి నిషేధం అన్నారు..జగన్ పర్యటన మొత్తం డ్రోన్ కెమెరాల ద్వారా రికార్డు చేస్తామని,,లైవ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేస్తామన్నారు..ఎవరైనా షరతులు అతిక్రమిస్తే అందరి మీదా కేసులు పెట్టడడం జరుగుతుందన్నారు.. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకాశం,,పల్నాడు,,చిత్తూరు జిల్లాల పర్యటనలు దృష్టిలో ఉంచుకుని జిల్లా పర్యటన ప్రశాంతంగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని,,ప్రజలు సహకరించాలని జిల్లా ఇంచార్జ్ SP దామోదర్ కోరారు..

