“పురమిత్ర ” యాప్ తో ఆన్లైన్ సేవలు సులభతరం- కమిషనర్ నందన్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ రూపొందించిన పురమిత్ర యాప్ ద్వారా మున్సిపల్ ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు, తాగునీటి కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్, శివరేజ్ టాక్స్, ప్రాపర్టీ మ్యూటేషన్ ఫీజు, లీజ్ అండ్ అగ్రిమెంట్స్ ఫీజ్, అడ్వర్టైజ్మెంట్ టాక్స్ లను సులభంగా చెల్లించవచ్చని తెలిపారు. అదే విధంగా యాప్ ద్వారా పబ్లిక్ హెల్త్ & శానిటేషన్, వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, అర్బన్ పావర్టీ అలివియేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్, స్ట్రీట్ లైటింగ్, రెవెన్యూ సంబంధిత సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలంతా పురమిత్ర మొబైల్ యాప్ ను కింద కనబరచిన క్యూఆర్ కోడ్ లేదా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మున్సిపల్ సేవలను సులభతరం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen

