ఈ నెల 13న జాతీయ మానవహక్కుల కమీషన్ జిల్లాకు రాక-కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు: జాతీయ మానవహక్కుల కమీషన్ ఈనెల 13 నుంచి 16వ తేది వరకు జిల్లాలో పర్యటించనుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ విభాగానికి చెందిన కుల్బీర్ సింగ్, యతిప్రకాశ్ శర్మ, సంజయ్ కుమార్‌లతో కూడిన బృందం జిల్లాలోని అల్లిమడుగూ పంచాయతీని సందర్శించి విచారణ నిర్వహించనున్నారని పేర్కొన్నారు.ఈ విచారణ సందర్భంగా, బృందం అల్లిమడుగూ గ్రామపంచాయతీ, ఆర్.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరు జిల్లాలోని ఇతర సంబంధిత ప్రదేశాలను సందర్శిస్తుందని వెల్లడించారు. సందర్శనలో భాగంగా, బృందం సంబంధిత వర్గాలు, ప్రభుత్వ సంస్థలు, అధికారులు మొదలైనవారి నుంచి నివేదికలను స్వీకరరించనుందని కలెక్టర్ తెలిపారు.