తిరుపతిజిల్లాలో బుధ,గురువారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు-కలెక్టర్.వెంకటేశ్వరన్
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో నవంబర్ మంగళ,,బుధ,,గురువారల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాల సమయంలో చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజ్ వే లపై నీరు ప్రవహిస్తుంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అదేశించారు. సహాయం, సమాచారం కోసం క్రింది నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007,,గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-నెం: 08624- 252807,, సూళ్లూరుపేట ఆర్ డి ఓ కార్యాలయం-నెం: 08623-295345,,తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం-నెం: 7032157040,,శ్రీకాళహస్తి ఆర్ డి ఓ కార్యాలయం-నెం: 8555003504…
వాతావరణశాఖ:- నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది..ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుపానుగా మారే అవకాశం ఉంది..అటు తరువాత 2 రోజులలో శ్రీలంక తీరం దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉంది..దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుంచి 29 వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది..అలాగే చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.