DISTRICTS

మై భారత్ యువ (NYK) వాలంటీర్లు నోటిఫికేషన్-జిల్లా యువజన కేంద్రం

నెల్లూరు: జిల్లాలో మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగి,అర్హత వున్నయువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నియామకానికి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.01 ఏప్రిల్ 2025 నాటికి వయస్సు కనీసం 18 సంవత్సరాలు-గరిష్టంగా 29 సంవత్సరాలు ఉండాలని,అలాగే నెల్లూరు జిల్లా వాసులై ఉండాలి తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులుగా చదువుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారని స్పష్టం చేశారు.

ఎంపిక ప్రక్రియలో ఉన్నత విద్యార్హతలు కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, అలాగే మై భారత్ అనుబంధ యువజన సంఘాల సభ్యులకు ప్రాధాన్యత కల్పించబడుతుందని తెలిపారు.ఎంపికైన యువ వాలంటీర్లకు నెలకు రూ.5,000/- (అన్ని కలిపి) గౌరవ వేతనం అందించబడుతుందని తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 20వ తేదీ చివరి తేదీగా నిర్ణయించబడినందున ఆసక్తి కలిగిన యువత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి కోరారు.

ఆన్లైన్ దరఖాస్తు కొరకు-https://nyks.nic.in/nycapp/main.asp సంప్రదించండి

మరిన్ని వివరాలకు:- 9963533440..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *