DISTRICTSEDU&JOBSOTHERS

నెల్లూరులో వీఆర్ హైస్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించిన మంత్రి లోకేష్

నెల్లూరు: జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు..సోమవారం నెల్లూరు నగరంలో ఆధునికరించిన వి.ఆర్.హైస్కూల్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు.. అనంతరం మంత్రి నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట రాగా పాఠశాల మొత్తం పరిశీలించారు.. డిజిటల్ తరగతి గదులను, రోబోటిక్ ల్యాబ్,  హైడ్రోఫోలిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, వివిధ రకాల ఆట వస్తువులతో కూడిన ఆట స్థలాన్ని మంత్రి సందర్శించారు. ఉపాధ్యాయులను పలకరించి వారితో ఫోటోలు దిగారు. విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్,వాలీబాల్ ఆటలాడారు..

సీట్లు లేవనే బోర్డు చూస్తేనే:- అనంతరం వీఆర్సీలో నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ 150 ఏళ్ల విఆర్సి పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా మిగిలితే, పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరైన మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇతరులు అసూయపడే రీతిలో అధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్ సి సి గ్రూపును, మంత్రి నారాయణ కుమార్తె షరణిని అభినందించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి, సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యామంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందన్నారు. ఉపముఖ్యమంత్రి తరచుగా చెప్పే చెట్లను నాటాలి, వాటిని కాపాడాలనే ఉద్దేశంతో పిల్లలకు చెట్ల విలువను తెలియజేస్తూ వారికి గ్రీన్ పాస్ పోర్ట్ అందజేస్తామన్నారు.

సంవత్సరానికి రెండుసార్లు:- విద్యార్థినీ విద్యార్థులు చదువులో ఏ స్థాయిలో ఉంటున్నారో, అలాగే ఇంటా బయట వారి ప్రవర్తన, ఆటపాటలు, తదితర అన్ని విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. సంవత్సరానికి రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారు:- రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిందని, అందుకు నిదర్శనమే విఆర్‌ హైస్కూల్ యని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం మూసేసిన విఆర్‌ హైస్కూల్‌ను ఆధునీకరించి మళ్లీ తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పి4 కార్యక్రమంలో భాగంగా ఎన్‌సిసి అధినేత రాజు, తన కుమార్తె షరణి ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి కృషిచేశారని కొనియాడారు.

అప్పట్లో 6800మంది విద్యార్థులు:- ఎన్నికల ముందు నెల్లూరుసిటీలో 94వేల ఇళ్లు ఉంటే 84వేల ఇళ్లను డోర్‌ టు డోర్‌ తిరిగానని, మురికివాడల్లో నిరుపేదల కష్టాలు స్వయంగా చూసి, వారి కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతోనే విఆర్‌ హైస్కూల్‌ను తిరిగి ప్రారంభించి ఆ నిరుపేద బిడ్డలకు అడ్మిషన్స్‌ కల్పించినట్లు చెప్పారు. తాను ఇదే హైస్కూల్‌లో 6 నుంచి డిగ్రీ వరకు చదివానని, ఇక్కడే అధ్యాపకునిగా పనిచేశానని, అప్పట్లో 6800మంది విద్యార్థులు చదువుకునేవారని ఆనాటి జ్ఞాపకాలను మంత్రి నారాయణ గుర్తుచేశారు. ఈ స్కూల్‌ పున: ప్రారంభానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే అనుమతులు మంజూరు చేసి గొప్ప స్కూల్‌గా మార్చేందుకు సహకరించారని, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో పుట్టి బాగా స్థిరపడిన ప్రతిఒక్కరూ కూడా పి4 కార్యక్రమంలో భాగస్వామ్యులై పాఠశాలల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్,,మంత్రులు ఆనం.రామనారాయణరడ్డి,,జిల్లా ఇన్‌చార్జి మంత్రి నస్యం మహ్మద్‌ ఫరూక్‌,,ఏ.పి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,,నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,,ఎమ్మేల్యే,,ఎమ్మేల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *