అపార్ట్మెంట్లలోని ప్లాట్ల యజమానులు మీటర్ తో కూడిన కుళాయి కనెక్షన్స్-కమీషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఆర్కే నగర్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు ప్రాంతాలలోని అపార్ట్మెంట్లలో ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లను బుధవారం తనిఖీ చేశారు. అపార్ట్మెంట్లలోని ప్లాట్ల యజమానులు అందరూ తప్పనిసరిగా మీటర్ తో కూడిన కుళాయి కనెక్షన్ పొంది అందుకు సంబంధించిన తాగునీటి కుళాయి పన్నులను క్రమం తప్పకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ భాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.అనధికార కుళాయి కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించేలా నిరంతరం చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. తనిఖీలలో అక్రమంగా కుళాయి కనెక్షన్ ఉండటాన్ని గుర్తించిన కమిషనర్ సంబంధిత వార్డు అమెనిటీస్ కార్యదర్శి, వర్క్ ఇన్స్పెక్టర్, ఫిట్టర్, ఏ.ఈ లకు షోకాజు నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు. నిర్దేశించిన సిబ్బంది తప్పనిసరిగా తాగునీటి కుళాయి పన్నులను వసూలు చేసేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

