అనధికార లేఅవుట్లు-ప్లాట్లు క్రమబద్ధీకరణకు చివరి అవకాశం
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ G.O Rt NO.1173 తేదీ 27.10. 2025 ఉత్తర్వుల్లో 30.06.2025లోపు రిజిస్టర్ అయిన అనధికార లేఅవుట్లు-ప్లాట్లు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు 23.01.2026లోపు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం కల్సించిందని సిటీ చీప్ ప్లానర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అనధికార లేఅవుట్లు-ప్లాట్ల యజమానులు అందరూ క్రమబద్దీకరణ కోసం LRS పోర్టల్ (https://dtcp.ap.gov.in/LRS)లో లేక నేరుగా Citizen లాగిన్ లేదా నగరపాలక సంస్థ నుంచి లైసెన్స్ పొందిన LTPల ద్వారా నిర్ణత గడువులోగా అంటే 23.01.2026 లోపల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏమైనా సందేహాలు లేదా సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నెం.0861-2316777 లేదా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సంప్రదించవలసినదిగా కోరారు..ప్రజలు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

