సొంత స్థలం కలిగిన వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం రూ 2.5 లక్షలు-కమిషనర్ నందన్
పీఎం ఆవాస్ యోజన…
నెల్లూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా సొంత స్థలం కలిగిన వారికి రూ 2.5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి గృహ నిర్మాణాలకు తోడ్పడుతుందని, పథకాన్ని అర్హులైన ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. సోమవారం కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు. అదే విధంగా ఎన్టీఆర్ కాలనీలలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి బీసీ వర్గాల వారికి రూ. 50వేలు, ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలకు 75 వేల రూపాయల వరకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించి ఇళ్ల నిర్మాణాలకు తోడ్పడుతుందని కమిషనర్ తెలిపారు.
ఎల్.ఆర్.ఎస్ పథకం ఆవశ్యకతను గుర్తించి అనధికార లేఔట్ల యజమానులు, స్థలాల యజమానులు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్దేశించిన క్రమబద్ధీకరణ విధానం ద్వారా యాజమాన్యపు హక్కులను పొందాలని కమిషనర్ సూచించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ పథకాన్ని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.