జిల్లా జర్నలిస్టు క్రికెట్ టీమ్ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన కలెక్టర్
నెల్లూరు: నెల్లూరుజిల్లా జర్నలిస్టు క్రికెట్ టీమ్ రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ చూపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకాంక్షించారు. అనంతపురంలో ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరు వారి చాంబర్‌లో నెల్లూరు జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపి సభ్యులు కలెక్టర్‌ను మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి నెల్లూరుజిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీం సభ్యులకు క్రికెట్ గ్లౌజ్‌లను అందించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నరేష్, జిల్లా అధ్యక్షులు నంద కిషోర్, కార్యదర్శి సునీల్, వెంకట్రావు,మౌంట్ బ్యాటన్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.