ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని జిల్లాకలెక్టర్
జిల్లా వ్యాప్తంగా మొదలైన “బీట్ ద హీట్”
నెల్లూరు: వేసవి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు,,ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని జిల్లాకలెక్టర్ ఆనంద్ కోరారు..శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా నెల్లూరు నగరంలోని రిత్విక్ ఎన్క్లేవ్ పార్కులో నిర్వహించిన బీట్ ద హీట్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలను జిల్లా కలెక్టర్ ఆనంద్, నగర కమిషనర్ నందన్, స్థానిక నాయకులు కోటంరెడ్డిగిరిధర్ రెడ్డి, నాటారు..
ఈ సందర్బంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో 50 వేల కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు..మహిళలందరూ చిన్న చిన్న మొక్కలతో రూఫ్ టాప్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలి సూచించారు.. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు..