P4 మార్గదర్శి కార్యక్రమం బాగంగా 25 కుటుంబాలను దత్తత డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచనలతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు P4 మార్గదర్శి కార్యక్రమంలో భాగంగా స్వంత నిధులతో 25 బంగారు కుటుంబాలకు గురువారం బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. P4 మార్గదర్శి కార్యక్రమం కింద 4వ వార్డులో 25 బంగారు కుటుంబాలను డిప్యూటీ కమిషనర్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా 4వ వార్డు TDP ఇన్‌చార్జి మామిడాల మధు మాట్లాడుతూ, బంగారు కుటుంబాలకు అవసరమైన సహాయం, మార్గదర్శకత అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, పి4 మార్గదర్శి కార్యక్రమం ద్వారా సమాజంలోని బలహీన వర్గాలను ఆదుకోవడం ప్రధాన లక్ష్యమని, బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిరంతరం సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) డీ.ఈ.ఈ శ్రీనివాస రెడ్డి, పొత్తూరి శైలజ, స్థానిక ప్రజాప్రతినిధులు, CVAP (P4) యూనిట్ సిబ్బంది, వార్డు సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

