స్వచ్ఛ ర్యాంకు సాధనలో తోడ్పడిన వారందరికీ అభినందనలు-కమిషనర్ నందన్
నెల్లూరు: స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో ఉత్తమ ర్యాంకులను సాధించడంలో తోడ్పడిన నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకు సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులతో కమిషనర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులను సాధించడంలో నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ ఎంతగానో కృషి చేశారని, రానున్న రోజులలో మరింత ఉన్నతమైన ర్యాంకును సాధించేందుకు మరింతగా తోడ్పడాలని కమిషనర్ ఆకాంక్షించారు. అనంతరం శానిటేషన్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బందిని కమిషనర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఇంజనీరింగ్ విభాగం ఎస్ ఈ రామ్మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, డి.ఈ అనిల్, శానిటేషన్ సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, PMU సిబ్బంది పాల్గొన్నారు.

