నుడా, నెల్లూరు కార్పొరేషన్ అధికారుల అవినీతిపై చర్యలు తీసుకోవాలి-ఆనం
నెల్లూరు: నెల్లూరు నగరపాలకసంస్థ, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా)లో అపార్ట్ మెంట్లకు, భవనాలకు నిబంధనలను తుంగలో తొక్కి భారీగా డబ్బులు తీసుకుని అనుమతులు మంజూరు చేస్తున్నారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం.వెంకటరమణారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మార్టిగేజ్ స్కాంను బయటపెట్టానని, హైకోర్టులో కూడా కేసు జరుగుతుందన్నారు.. అయినా అధికారులు ఎవ్వరూ బాధ్యత లేకుండా తమ అక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. బిల్డర్లతో కుమ్మక్కై నుడా, కార్పొరేషన్ అధికారులు మంత్రి నారాయణకు, ఐఎఎస్ అధికారులకు చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.