DISTRICTS

నగరంలో ఏబివిపీ ఆధ్యర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ స్పూర్తి ర్యాలీ

నెల్లూరు: చత్రపతి శివాజీ జయంతి సందర్బంగా నెల్లూరు నగరంలో ఏబివిపీ ఆధ్యర్యంలో వి.ఆర్.సి మైదానం నుంచి నగరంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్త చంద్రశేఖర్,బయ్య.సురేష్,,సురేంద్రరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంలో బయ్య.వాసు మాట్లాడుతూ దేశభక్తి అంటే నినాదం కాదని, అది పౌరుల కర్తవ్యం అనే విషయంను విద్యార్దిని,విద్యార్దులు అందించామన్నారు.16 సంవత్సరాల వయస్సులోనే చత్రపతి శివాజీ యుద్దంలో మొదటి కొటను జయించి తన విజయ యాత్ర కొనసాగించాడన్నారు. విద్యార్దిని,విద్యార్దులు దేశం కోసం,ధర్మం కోసం చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని దేశం కోసం భారతదేశ విచ్చిన్నం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లను నిరోధించాలని కోరారు.ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్దిని,విద్యార్దులు,ఏబివీపి పూర్వ విద్యార్దులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *