విధుల నిర్వహణతో పాటు శారీరిక,మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాలి-కమిషనర్ నందన్
నెల్లూరు: క్రీడల ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చని, ఉద్యోగ విధుల నిర్వహణలో ఉన్న పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని నగరపాలక సంస్థ అన్నారు. స్వర్ణ సచివాలయ కార్యదర్శులు విధుల నిర్వహణతో పాటు శారీరిక మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించి, పోటీలలో క్రీడా స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు. నగరపాలక సంస్థ వార్షిక క్రీడోత్సవాలు-2026 పోటీల విజేతలకు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానం కార్యక్రమంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ హాజరై విజేతలకు మెడల్స్, ప్రసంశాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ఏ.సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో జనవరి నెల 28, 29 తేదీలలో రెండు రోజులపాటు స్వర్ణ సచివాలయ కార్యదర్శులకు “సింహపురి గ్రామ వార్డు సచివాలయ జాయింట్ యాక్షన్ కమిటీ” ఆధ్వర్యంలో పురుషులు, మహిళలకు వివిధ విభాగాలలో క్రీడా పోటీలను నిర్వహించారని తెలిపారు.
మానసిక ఆరోగ్యం కోసం:- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, డిప్యూటీ డైరెక్టర్ మాధురిలు మాట్లాడుతూ స్వర్ణ సచివాలయ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం జె.ఏ.సి చేపట్టిన క్రీడా పోటీలు ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు. జె.ఏ.సి ఆధ్వర్యంలో త్వరలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని జె.ఏ.సి నిర్వాహకులకు సూచించారు.
విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సింహపురి జేఏసీ సభ్యులతో నిర్వహిస్తున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక క్రీడలు ఆర్గనైజర్స్ సింహపురి జేఏసీ-నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నిర్వాహకులు మురళీకృష్ణ, శశి కిరణ్, భాను ప్రకాష్, షాహినా, విజయలక్ష్మి, మోజస్, హరికృష్ణ, రాజేష్, దారా సురేష్ బాబు, విరోషా గాంధీ, సంధ్య, ఝాన్సీ, ఫయాజ్ అహ్మద్, తోట సుమన్, వార్డు సచివాలయ అన్ని విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.

