పేద విద్యార్థులందరూ ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలి-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు..ఈ ఏడాది హాస్టళ్ల మరమ్మతులకు ప్రభుత్వం కోట్లాదిరూపాయల నిధులు మంజూరు చేసిందని,, పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు..సన్నబియ్యంతో అన్నం అందిస్తూ, రుచికరమైన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు. జిల్లాలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 63 ప్రీమెట్రిక్, 16 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు నిర్వహిస్తున్నారు.2025-26 విద్యా సంవత్సరానికి మొత్తము 63 ప్రీమెట్రిక్, 16 పోస్ట్ మెట్రిక్ వసతి గృహలతో కలిపి ప్రస్తుతం 4120 మంది విద్యార్థినీ, విద్యార్థులు వసతి పొందుతున్నారు.ఇందులో 2373 మంది రెన్యువల్ విద్యార్దులు కాగా, 1654 మంది కొత్తగా హాస్టళ్ళలో చేరారు. ఇంకను అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
హాస్టళ్లలోని పేద విద్యార్థులకు:- ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మంచి భోజనం, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసక్తి గల తల్లిదండ్రులు వసతి గృహాల్లో సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి, సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయం, జిల్లా బీసీ, ఎస్‌సి వెల్ఫేర్ అధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

