BUSINESSDISTRICTSOTHERS

దేశంలో ఎక్కడా లేని విధంగా 114 ఎకరాలలో హార్బరును ఏర్పాటు-మంత్రి కొల్లు

నెల్లూరు: జువ్వలదిన్నె వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ వల్ల మత్య్స కారులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లయితే  ప్రభుత్వం వాటిని ముందుండి పరిష్కరిస్తుందని రాష్ట్ర  గనులు, భూగర్భ వనరులు-ఎక్సైజ్ శాఖ మంత్రి.కొల్లు.రవీంద్ర అన్నారు. మంగళవారం కలెక్టర్ లో జరిగిన మత్య్సకారులు-అధికారులతో ముఖా ముఖి కార్యక్రమములో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చాలా రాష్త్రాలు, దేశాలు సైతం సదరు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటుకై పోటీ పడుతున్నాయన్నారు. సమస్యలు ఏమైనా స్థానిక నాయకుల సహకారాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

29 ఎకరాలలో డిఫెన్సు పరిశ్రమ:- సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు వల్ల మత్య్సకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందిని, మత్య్స సంపద ఎక్కడ ఉన్నది, సైక్లోన్-అల్ప పీడనాల వల్ల సముద్రంలో చిక్కుకున్న వారిని రక్షించవచ్చని తెలిపారు. సుమారు రెండు వేల అయిదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో 29 ఎకరాలలో డిఫెన్సు పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. ఉత్సాహము, తపన నేర్చుకోవాలనే దృక్పదం ఉన్న స్థానిక యువతకు ఉపాధి అవకాశం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 114 ఎకరాలలో హార్బరును ఏర్పాటు చేయడం జరిగిందని, ముందు చూపుతోనే అనుబంద పరిశ్రమలు ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ కంపెనీ చేసిన బోట్ల పరీక్షకి కేవలం 150 మీటర్లు కేటాయించడం జరిగిందని. పరిశ్రమల ఏర్పాటుకై స్థానికులు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే వారికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. కృష్ణ పట్నం పోర్టు ఏర్పాటు ద్వారా నెల్లూరు రూపు రేఖలు మారాయన్నారు. ఈ కార్యక్రమములో ఎమ్మల్యేలు రవీచంద్ర,కళ్యాణ చక్రవర్తి,ఎమ్మేల్యే కృష్ణరెడ్డి,రాంగోపాలరెడ్డి, షిప్ యార్డ్ చైర్మన్ సత్య, డిప్యూటి మేయర్ రూప్ కుమార్, గిరిధర్ రెడ్డి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *