అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులు అజార్ డానిష్ అరెస్ట్
అమరావతి: ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్,, జార్ఖండ్ ATC,, రాంచీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది అజార్ డానిష్‌ను అరెస్టు చేశారు.. అతడి వద్ద నుంచి కొన్ని డిజిటల్ పరికరాలు, పాస్‌పోర్టులు, ఐడియాలజీకి సంబంధించిన డేటా వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. గతంలో ఇతనిపై ఢిల్లీలో కేసు నమోదైంది..దీని ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్ అతని కోసం వేటాడి పట్టుకుంది..మరో సంఘటనలో ఢిల్లీ పోలీసు వర్గాలకు అందిన విశ్వనీయ సమాచారంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్-కేంద్ర సంస్థల సంయుక్త దాడిలో ఢిల్లీలో మరో అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు..అలాగే 8 ప్రదేశాలలో దాడులు జరుగుతున్నాయి.. సదరు ప్రాంతాల్లో పట్టుబడిన దాదాపు 8 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు సమాచారం.. ఐసిస్ నెట్వర్క్ దేశంలో ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందన్న దానిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వర్గాలు ఉగ్రవాదిని ప్రశ్నిస్తున్నారు.