నిమిషాల వ్యవధిలో రూ.31 లక్షల రూపాయల దారిదొపిడి
అమరావతి: నిమిషాల వ్యవధిలో పట్టపగలు బిజీగా రోడ్డపైన ఏ మాత్రం అనుమానం రాకుండా బెంగళూరు శివారులోని బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తిని నలుగురు ఆగంతలకులు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….కైలాశ్ అనే వ్యక్తి ఉడాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఉడాన్ కంపెనీకి చెందిన రూ.31 లక్షల రూపాయల్ని బ్యాగులో దాచుకుని స్కూటీపై బన్నేర్‌ఘట్ట వెళుతున్నాడు.కల్వారా రోడ్డులో వెళ్తుండగా.. సడన్ గా నలుగురు వ్యక్తులు రెండు బైకుల మీద వచ్చి, బైకులను అడ్డుపెట్టి స్కూటీని ఆపేశారు.తమతో తెచ్చుకున్న పొడవాటి తల్వర్లు చూపించి కైలాశ్‌ను బెదిరించి,,ఆయన వద్దనున్న నగదుతో కూడిన బ్యాగును లాక్కున్నారు. అలాగే కైలాస్ వెంబడించకుండా స్కూటీని కూడా లాక్కున్నారు. రెండు బైకులపై ముగ్గురు, స్కూటీపై ఒకరు కలసి అక్కడి పరిపోయారు.అగంతలకు కొన్ని కిలోమీటర్ల తరువాత స్కూటీని రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్లిపోయారు. కైలాశ్,,బన్నేర్‌ఘట్ట పోలీస్ స్టేషన్ వెళ్లి ఈ దోపిడీ సంఘటనపై ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దోపిడీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.సిపి టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

