CRIMEOTHERSWORLD

మసీదులో భారీ పేలుడు-40 మంది మృతి

అమరావతి: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక మసీదులో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేలింది. 40 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు చిత్రాలలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 80 మంది వరకు గాయపడగా ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా వుంది.  ప్రాథమికంగా ఆత్మాహుతి దాడిగా పోలీసులు అంచనా భావిస్తున్నారు. సైనిక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. స్థానిక మీడియా కథనల మేరకు… ఇస్లామాబాద్ గ్రాండ్ మసీదుగా పిలువబడే కస్ర-ఎ-ఖాదీజతుల్ కుబ్రా మసీదులో పేలుడు సంభవించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారింది. హఠాత్తు పరిణామంతో జనం అటు ఇటుగా పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పటి వరకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *