ట్రైయిన్ అన్ లైన్ రిజర్వేషన్ మాఫియా గుట్టును రట్టు చేసిన ఐ.ఆర్.సి.టీ.సి
అమరావతి: ట్రైయిన్ రిజర్వేషన్ అన్ లైన్ లో చేసుకోవడం ఆలవాటు అయిన తరువాత రైల్వే బుకింగ్ కౌంటర్స్ వద్దకు వెళ్లి క్యూలో నిలబడి రిజర్వేషన్ చేసుకోవాడం దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి..దిన్నేఆసరాగా చేసుకుని,, రిజర్వేషన్ టిక్కెట్ల మాఫియా,,బాట్ అనే సాప్టవేర్ ఉపయోగించి, తత్కాల్ బుకింగ్ విడుదలైన నిమిషాల్లో టిక్కెట్లను బుక్ చేసుకుని బయట మార్కెట్ లో బ్లాక్ లో అమ్ముకుని కోట్లు సంపాదిస్తున్నారు..వివరాల్లోకి వెళ్లితే….
బుకింగ్ సమస్య వెనుక:- లక్షలాది మంది రైల్వే ప్రయాణికులు ప్రతిరోజూ రిజర్వేషన్ సమయంలో ఎదుర్కొనే టికెట్ బుకింగ్ సమస్య వెనుక ఉన్న మాఫియా గుట్టును IRCTC రట్టు చేసింది..టిక్కెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోవడం వెనుక భారీ స్కామ్ ఉందని, ప్రకటించింది..
Tickets Not Available అని మెసేజ్:- టిక్కెట్ల్ బుకింగ్ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యపై దాదాపు 134 కప్లయింట్ రావడంతో,,ఈ విషయంపై IRCTC చేసిన విచారణలో అధికారులు బిత్తపోయే భారీ స్కామ్ బయటపడింది.. గత అయిదు నెలల్లో టికెట్ బుకింగ్ విండో ఓపెన్ కావడానికి ఐదు నిమిషాల ముందే 2.9 లక్షల PNRలు జనరేట్ అయ్యేయి..ఇది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం.. టిక్కెట్ల మాఫియా వ్యక్తులు,, బాట్స్ (bots) అనే ఆటోమేటెడ్ టూల్స్ (సాప్ట్ వేర్) తో టికెట్లను క్షణాల్లో బుక్ చేసేవారు..దీంతో సాధారణ ప్రయాణికులు లాగిన్ అయ్యేలోపే టికెట్లు అయ్యిపోయేవి..రిజర్వేషన్ స్లాట్ ఓపెన్ అయ్యే సమయానికి మీరు IRCTCలో లాగిన్ అయి టికెట్ల కోసం ప్రయత్నిస్తే మీకు వెంటనే Waiting List రావడం లేదా Tickets Not Available అని మెసేజ్ వస్తుంది..
అంటే అప్పటికే బాట్స్ (bots) అనే ఆటోమేటెడ్ టూల్స్ టిక్కెట్లను బుక్ చేసేస్తాయి.. దీంతో ప్రత్యేక రైళ్ల టికెట్లు, తత్కాల్ టికెట్లు ఇలా ఏదైనా బుక్ చేయాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.. బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లో టికెట్లు మాయమైపోతుండడమే ఈ స్కామ్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు..ఈ ముఠా బాట్స్ ఉపయోగించి IRCTC వెబ్‌సైట్‌లో ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్లు రన్ చేసి, ముందుగా లాగిన్ అయి టికెట్లు బుక్ చేసినట్లు చెప్పారు.. అలాగే నకిలీ ఆధారాలతో యూజర్ అకౌంట్లను తయారు చేసి, రిజర్వేషన్లను లాగింగ్ ప్రాసెస్‌ను ముందుగానే హ్యాక్ చేసేవారని వెల్లడించారు..ఈ టికెట్లను తరువాత పెద్ద మొత్తాలకు మధ్యవర్తుల ద్వారా ప్రయాణికులకు బ్లాక్‌లో అమ్మేవారు..దీనివల్ల లక్షలాది మధ్యతరగతి ప్రజలు ప్రయాణించలేక పోయేవారు..
బాట్స్ (bots) సాప్టవేర్ ను ఉపయోగించేందుకు మాఫియా మూట సిద్దం చేసిన 6,800 డిస్పోజల్ ఇమెయిల్ డొమైన్‌లను అధికారులు బ్లాక్ చేశారు..అలాగే 2.5 కోట్ల IRCTC యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేశారు..అనంతరం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ సమయంలో 20 లక్షల ఓరిజన్ యూజర్ ఐడీలను తిరిగి యాక్టివేట్ చేశారు..
దింతో IRCTC,, Anti Bot Application అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు..ఈ యాప్ బాట్స్ ద్వారా జరిగే ఆటోమేటెడ్ బుకింగ్‌ను తక్షణమే గుర్తించి ఆపేస్తుంది..తద్వారా సామాన్య ప్రయాణికులకు మరింత పారదర్శకంగా, సమయానికి టికెట్లు లభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

