భారీ వర్షాల కారణంగా అదుపు తప్పిన కారు,11 మంది మృతి
అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు..పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు బొలెరో SUVలో బయలుదేరిన 15 మంది బయలుదేరారు..భారీ వర్షాల కారణంగా , ఇటియాథోక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా బహుతా రెహ్రా మోడ్ సమీపంలో కారు అదుపు తప్పి సరయు నది కాలువలో దూసుకెళ్లింది..ఈ ఘోర ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయరని,,ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని గోండా జిల్లా ఎస్పీ వినీత్ జైస్వాల్ తెలిపారు..
ఒకే కుటుంబంకు:- మృతులు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ నివాసితులు కాగా వీరిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు..బీనా (35),,కాజల్ (22),,మహాక్ (12),,దుర్గేష్,,నందిని,, అంకిత్,, శుభ్,,సంజు వర్మ,,అంజు,, సౌమ్యలు ఈ ప్రమాదంలో మృతి చెందారని వెల్లడించారు..మరణించిన వారిలో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ ప్రమాదం తీవ్రత మరింత విషాదకరంగా మారింది.. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనపై వెంటనే స్పందించి,,మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు..అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని,,గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులను అదేశించారు..గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

