AP&TGOTHERSSPORTS

 ఆగస్టు 15 నుంచి విజయవాడలో ‘యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్’2025

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అభిమానులకు శుభవార్త. రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ‘యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025’కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలుగు కబడ్డీ లీగ్‌కు ముందు ఈ టోర్నమెంట్ ఔత్సహిక క్రీడాకారులకు ఒక మంచి అవకాశం..

46 జట్ల మధ్య హోరాహోరీ:- ఆగస్టు 15వ తేదీ నుంచి విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ఈ కబడ్డీ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్ ఆగస్టు 25న ముగుస్తుంది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్ల మధ్య మొత్తం 46 హోరాహోరీ మ్యాచ్‌లు జరగనున్నాయి. కబడ్డీ ప్రియుల కోసం ఈ మ్యాచ్‌లన్నీ ఫ్యాన్‌కోడ్ వేదికగా హిందీ, తెలుగు భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

క్రీడాకారుడికి సువర్ణావకాశం:- ఈ ఛాంపియన్‌షిప్ ప్రాముఖ్యత గురించి యువ కబడ్డీ సిరీస్ సీఈఓ వికాస్ గౌతమ్ మాట్లాడుతూ… “ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలుగు కబడ్డీ లీగ్‌కు యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ ఒక ఫీడర్ టోర్నమెంట్‌గా నిలుస్తుంది. ఇందులో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి ఇది ఒక సువర్ణావకాశం. ఇక్కడ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, తెలుగు కబడ్డీ లీగ్‌కు అర్హత సాధించవచ్చు. తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, ప్రొఫెషనల్ కబడ్డీలో తమ కలలను సాకారం చేసుకోవచ్చు” అని వివరించారు.

టోర్నీలో పాల్గొంటున్న జట్లు, గ్రూపుల వివరాలు:-ఈ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ A: కాకినాడ క్రాకెన్, విజయనగరం నింజాస్, భీమవరం గార్డియన్స్, కర్నూలు నైట్స్..

గ్రూప్ B: కృష్ణా డిఫెండర్స్, అమరావతి క్రషర్స్, తిరుపతి రైడర్స్, విశాఖ కమాండోస్.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *