AP&TGDEVOTIONALOTHERS

శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలకు దేవగణానికి స్వాగతం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైనా బుధవారం స్వామివారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, బ్రహ్మ విష్ణువులను,  సకల దేవతా మునిగనాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. పుర విహారం చేసిన పంచమూర్తులు ఆలయంలోని స్వామి వారికి గర్భాలయం ముందు కలిసి స్థాపన చేసి పూజలు చేశారు. త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం వెలిగించి శాశ్వతంగా పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వృషభ ధ్వజాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టాపించి ప్రత్యేక పూజలు చేసి సకల దేవత గణాలను స్వాగతించారు. 12 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎటువంటి విజ్ఞాలు జరగకుండా నిర్విగ్నంగా జరిగేలా చూడమంటూ పూజించారు. కర్పూర నీరాజనాలు అర్పించారు. ఈ సందర్భంగా ఓం నమశ్శివాయ నామస్మరణలు మార్మోగాయి అనంతరం మళ్లీ పంచమూర్తులు పురవీధుల్లో ఊరేగి భక్తాదులకు దర్శనమిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *