ముందు చూపుతో నామినేటెట్ పదవుల భర్తీ
కొందరికి ఖేదం,మరి కొందరికి మోదం..
అమరావతి: ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవుల కేటాయింపులో, పార్టీకి కోసం పనిచేసిన నాయకుల ఎంపికలో మూడు పార్టీలు ముందు చూపుతో వ్యవహరించినట్లు కన్సిస్తొంది..ఇందులో బాగంగా 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం ప్రకటించింది..అందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది.. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు కేటాయించింది..గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి,, పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇచ్చారు.. ఆ క్రమంలో టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు.
కార్పొరేషన్ల ఛైర్మన్ల:-1- AP హౌసింగ్ బోర్డ్: బత్తుల తాత్యబాబు,,2- AP మారిటైమ్ బోర్డ్: దామచర్ల సత్య,,3- AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR): బొరగం శ్రీనివాసులు,,4- APలో ఉపాధి కల్పన & ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కోసం సొసైటీ): దీపక్ రెడ్డి,,5-వక్ఫ్ బోర్డు: అబ్దుల్ అజీజ్,,6-స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP): అనిమిని రవినాయుడు,,7-20 పాయింట్ ఫార్ములా: లంకా దినకర్ (బీజేపీ),,8. AP మార్క్‌ఫెడ్: కర్రోతు బంగార్రాజు,,9- AP స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మన్నె సుబ్బారెడ్డి,,10 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC : మంతెన రామరాజు,,11- AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య,,12- AP టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్: నూకసాని బాలాజీ,,13- APSRTC చైర్మన్, కొనకళ్ల నారాయణ,, వైస్ చైర్మన్ గా: పిఎస్ మునిరత్నం,,14- AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ,,15 లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు,,16- AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత,,17- A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSME DC): తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన),, 18- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్ సుధీర్ ( జనసేన),,19-AP టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO: వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన),,20- ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC): వజ్జా బాబురావులు నియమితులు అయ్యారు.