బలహీనపడిన తీవ్ర అల్పపీడనం-శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం (24) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది తదుపరి 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతుందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో 3-4 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
బలహీనపడిన తీవ్ర అల్పపీడనం:-
ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం
ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు
దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
తీరం వెంబడి 30-50కిమీ వేగంతో ఈదురుగాలులు
శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల్లో ఉండరాదని,,అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

