AP&TG

డ్రగ్స్, గంజాయిపై యుద్ధం-ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తాం-సీ.ఎం చంద్రబాబు

మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తుల జప్తు..

అమరావతి: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్నిపురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ “డ్రగ్స్ వద్దు బ్రో” అంటూ నినదించింది.. డ్రగ్స్, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని,,ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు..గరువారం గుంటూరులో ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు..

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే ఆస్తుల జప్తే:- ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు..“అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం..గంజాయి రవాణ, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నా,, సాగుచేసినా, బయట నుంచి తీసుకువచ్చి విక్రయించినా సహించేది లేదని హెచ్చరించారు.. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపాం…ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం..గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు కూడా జప్తు చేస్తాం.. జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు.. అవగాహన కల్పించేందుకు వినియోగిస్తాం.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మత్తులో మానవ మృగాలుగా మారుతున్నారు:- గంజాయి, డ్రగ్స్ బారిన పడి యువత నిర్వీర్యమవుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. “గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడితే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మనిషి మృగంగా మారతాడు..గంజాయి, డ్రగ్స్ సేవించే వ్యక్తులు సమాజానికి, తల్లితండ్రులకు పెద్ద సమస్యగా మారతారు. పిల్లలు, తల్లులు, చెల్లెళ్ల పైనా దాడులు చేస్తున్నారు. మూడేళ్ల పసికందులపైనా మానవ మృగాల్లా మారి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వీళ్లను ఎలా క్షమిస్తాం.? ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. 2047కి తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అందుకే ఇప్పటి నుంచే గంజాయి వంటి సమస్యల్ని పరిష్కరించుకుని ముందడుగు వేయాలి.” అని సీఎం అన్నారు.

డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదులకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లు:-మత్తుపదార్ధాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత తీసుకోవడమే కాదని.. దీనికి ప్రజా మద్దతు కూడా అవసరమని చంద్రబాబు అన్నారు. టోల్ ఫ్రీ నెంబరు 1972, వాట్సప్ నెంబరు 8977781972లను సీఎం విడుదల చేశారు. ఈ నెంబర్లకు సమాచారం అందించి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *