ఆ పదకొండు మంది కుప్పిగంతులు వేశారు-పవన్ కళ్యాణ్
అమరావతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ బడ్జెట్ పై ప్రసంగిస్తూన్న సమయంలో వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మేల్యే ప్రవర్తించిన తీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా అక్షేపించారు.గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మూడవ రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రసంగించి, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి వివరించారు.
