తిరుపతిజిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం
నెల్లూరు: తిరుపతిజిల్లా తడ సమీపంలో గురువారం 22 కీ.మి వేగంతో వాయుగుండం తీరం దాటిందని వాతావరణశాఖ పేర్కొంది..ప్రస్తుతం బలహీన పడిన వాయుగుండం ఆల్పపీడనంగా కొనసాగుతొంది..దిని ప్రభావంతో దక్షిణ కోస్తా,,రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి..అలాగే ఉత్తర తమిళనాడులో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి..నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశలు,,అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.