శంకర ఐ ఫౌండేషన్ సేవలు నిరుపమానం-ముఖ్యమంత్రి చంద్రబాబు
4-
పెదకాకాని శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన
గుంటూరు: అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఐదు దశాబ్ధాలుగా శంకర ఆస్పత్రి పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి లో నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని, నిస్వార్థంగా సేవలు చేసే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
కంచి కామకోటి పీఠం సేవలు అద్వితీయం:- ‘ఆధ్యాత్మికంగా భక్త జనావళి శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. ధర్మం, జ్ఞానం, సేవ మూల సిద్ధాంతాలుగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పీఠాన్ని కొనసాగిస్తున్నారు. సామాజికంగాను పేదలను, ఆపన్నులను ఆదుకునేందుకు కంచి కామకోటి పీఠం విశేషంగా పని చేస్తోంది. సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులోకి తెచ్చిన శంకర ఐ హాస్పటల్..1977లో ఈ సేవా ఉద్యమాన్ని ప్రారంభించింది. త్వరలో స్వర్ణోత్సవంలో అడుగుపెడుతోంది. సేవే పరమావధిగా భావించే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ మార్గదర్శకత్వంలో శంకర ఫౌండేషన్ మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం అన్నారు

