రాష్ట్ర ప్రగతి,ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం-పవన్ కళ్యాణ్
త్వరలో ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమా..
అమరావతి: మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలియని జగన్,, వాటి గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజ్ అయిపోదని భావించడం అతని ఆహంభావంకు నిదర్శమన్నారు..అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు,,మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.. 17 మెడికల్ కాలేజీలు మంజూరు అయితే ఒక్కటి మాత్రమే పూర్తయిందని తెలిపారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసిందని ఆరోపించారు. అందుకే తమా హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి సవాల్ చేశామని గుర్తు చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే ఎవరేం చేశారో తేలిపోతుందన్నారు. గతంలో సిద్ధం.. సిద్ధం.. అన్నారు.. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా.. అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:- ‘రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి’ అన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రగతి.. ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ సిక్స్ హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు విచ్చేసిన జన వాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేసే పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు.