మొంథా తుఫాన్ కు థాయిలాండ్ పేరు పెట్టింది-విధ్వసం ఏ మేరకు?
అమరావతి: అత్యంత తీవ్రంగా తీరం వైపు దూసుకుని వస్తున్న తుఫాన్ “మొంథా” అంటే అందమైన లేదా సువాసనగల పువ్వు అని అర్థం. ఈ పేరును థాయిలాండ్ అందించింది.మంగళవారం మొంథా తుఫాన్ తీరం దాటిన తరువాత ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది బుధవారం తెలియవచ్చు.? తుఫాన్లకు పేర్లు ఏ ప్రతిపాదిక పెడుతుంటారు అనేది తెలుసుకుందా.?
6 వాతావరణ కేంద్రాలు:- తుఫానుల తీవ్రతను చెప్పేందుకు ప్రపంచ వాతావరణతోపాటు ఆర్థిక, సామాజిక కమిషన్ ఆసియా, పసిఫిక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది..ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు 5 ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయి. అలాగే వీటి పేర్లను కూడా ఈ కేంద్రాలే పెడుతుంటాయి. ఈ 6 ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్(IMD) ఒకటి. ఈ కేంద్రలు 13 సభ్య దేశాలకు చెందిన తుఫానులకు సంబంధించిన సమాచారం అందిస్తుంటాయి.
తుపాన్లకు పేర్లు పెట్టే పద్దతిని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్,,వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ తుఫాన్లకు పేర్లు సంప్రదాయం వస్తోంది. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మల్దీవులు, ఒమన్, మయన్మార్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలు ఉన్నాయి.ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేశాయి. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రాలలో ఏర్పడే ఈ తుఫాన్లకు ఈ పేర్లను పెడుతుంటారు.ఒక దేశం తరువాత మరోక దేశం తదుపరి తుఫాన్ కు పేర్లను పెడుతుంటాయి. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావన్ని,నష్టంనుగుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి.

