ఏసీ భోగిలు టార్గట్ గా చేసుకొని దొంగతనాలు చేస్తున్న దొంగ షేక్ అబ్దుల్ రెహమాన్ అరెస్ట్
అమరావతి: ట్రైయిన్ లో ఏసీ భోగిలు టార్గట్ గా చేసుకొని దొంగతనాలు చేస్తున్న దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, రెండు లాప్ టాప్ లు నాలుగు స్మార్ట్ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నమని GRP DSP రత్నరాజు తెలిపారు..గుజరాత్ నుంచి చెన్నైకు రైల్లో ప్రయాణిస్తుండగా విజయవాడ లో బ్యాగ్ మిస్ అయినట్లు ప్రయాణికులు రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేశారని డిఃస్పీ తెలిపారు..దాదాపు 70 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ పోయినట్లు ఫిర్యాదు పేర్కొన్నారని తెలిపారు..సిసి ఫుటేజ్ ఆధారంగా రైల్వే పోలీసులు గుంటూరుకు చెందిన నిందితుడు షేక్ అబ్దుల్ రెహమాన్ ను దొంగతనం చేసినట్లుగా గుర్తించారు..పోలీసు దర్యాప్తులో నిందితుడు రెహమాన్ ఏసీ బోగీలు టార్గెట్ చేసుకొని నాలుగు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడని వెల్లడించారు..నిందితుడి వద్ద నుంచి రెండు లాప్ టాప్ లు,5 సెల్ ఫోన్లు 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నమని తెలిపారు.