లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ? కూటమిపై ప్రభావం పడుతుందా ?
అమరావతి: కూటమిలో లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ అంటూ టీడీపీ అనుకూల మీడియా వార్తలను వండివర్చుతొంది..ఇందుకు అనుగుణంగా టీడీపీ డిప్యూటివ్ స్పీకర్ రాఘురామకృష్టరాజు టీడీపీ అనుకూల మీడియాలో మాట్లాడుతూ లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ ఇస్తే తప్పేముందు? ఉపముఖ్యమంత్రి అనే పదవీ రాజ్యంగాలో లేదని,,అది కేవలం అలంకార ప్రాయం అంటూ సెలవిచ్చారు..మరి అలాంటప్పుడు,లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ అవసరమా? తనకు తాను తగ్గించుకుని,కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవులతో ప్రజల్లోకి దూసుకుని వెళ్లుతున్న పవన్ కళ్యాన్ ను చూసి, టీడీపీ సామాజిక వర్గంకు చెందిన నాయకులు తెర వెనకు నుంచి పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో బాగంగానే పీఠపురం మాజీ ఎమ్మేల్యే శ్రీనివాస వర్మ,సర్వేపల్లి ఎమ్మేల్యే సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులరెడ్డిలు స్వరం పెంచి,లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ అంటూ డిమాండ్లు పెంచుతున్నారు.ఇదే సమయంలో జనసేన నాయకులు ఇందుకు ధీటుగా స్పందిస్తు,చంద్రబాబుకు వయస్సు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసి లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవీ కట్టబెట్టి,తాను కేంద్రమంత్రిగా వెళ్లితే బాగుటుందని సలహా ఇస్తున్నారు.
చంద్రబాబు అవసరం కొద్ది:- ఇదే సమయంలో చంద్రబాబు అవసరం కొద్ది ఎలాంటి వారిని అయిన వాడుకుని వదిలేస్తాడని,,ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను వాడుకుని వదిలేసేందుకు ఈ ఆట మొదలు పెట్టారని వైసీపీకి చెందిన నాయకులు వ్యాఖ్యనిస్తున్నారు.గతంలో చంద్రబాబు,ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు.చంద్రబాబు నైజం తెలిసిన బీజెపీ ఆగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని,పవన్ కళ్యాణ్ జోక్యంతోనే,చంద్రబాబుతో కలసి కూటమిగా జత కట్టేరని అంటూన్నారు. ఇటీవల వైసీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక సందర్బంలో మాట్లాడుతూ 6 నెలల్లోనే ఎన్నికలు రావడం ఖయం అన్నమాట నిజం కాబోతుందా?
లోకేష్ ఉపముఖ్యమంత్రి పదవీ అంటూ వస్తున్న డిమాండ్లకు చంద్రబాబు వెంటనే స్పందించి టీడీపీ నాయకులను అదుపులో వుంచక పోతే,రానున్న రోజులో కూటమి వీడిపోక తప్పదు అన్న చెడు సాంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లుతాయి..పర్యవ్యసనం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానల పట్ల అంత సానుకూలంగా లేని,రాష్ట్ర ప్రజలు ఎలా స్పందిస్తారో??? వేచి చూడాలి.