11 మంది IAS అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
గతంలో TTD E.Oగా..
అమరావతి: రాష్ట్రంలో 11 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.TTD EO శ్యామలరావును బదిలీ చేసింది.గతంలో TTD EOగా పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంత్‌రామ్‌ను బదిలీ చేశారు. రెవెన్యూశాఖ (ఎండోమెంట్) కార్యదర్శిగా M.హరిజవహర్‌లాల్‌ను నియమించారు. ఆ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాడ్రేవు వినయ్ చంద్‌ను రిలీవ్ చేసింది. అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమించింది. మైనార్టీ, సంక్షేమ శాఖ కార్యదర్శిగా CH శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సురెన్స్, మెడికల్ సర్వీసెస్ కార్యదర్శిగా M.V.శేషగిరి బాబు బదిలీ చేసింది. ఆయనకు లేబర్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న M.T. కృష్ణబాబును, రోడ్లు, భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్‌ను బదిలీ చేశారు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. ఆయనకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్‌ను బదిలీ చేశారు.