‘ఫాంటమ్’ సినిమా పోస్టర్ తో వీడియోను విడుదల చేసిన ఉగ్రవాద సంస్థ
ఎట్టి పరిస్థితిల్లో ఫ్వారర్డ్ చేయవద్దు..
J&K Police ALERT…
https://x.com/JmuKmrPolice/status/1815320026259308742
అమరావతి: బాలీవుడ్ చిత్రం ‘ఫాంటమ్’ (Phantaom) పోస్టర్‌తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, సోమవారం నాడు విడుదల చేసిన ఓ వీడియోపై జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు..ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దంటూ ప్రజలకు అదేశాలు జారీ చేశారు..ఇందుకు భిన్నంగా ఏవరైన షేర్ చేస్తే,,చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని సెక్షన్ 13, 18 కింద నేరమవుతుందని హెచ్చరించారు..జైషే ఉగ్రవాద సంస్థ నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 5 నిమిషాల 55 నిమిషాల నిడివి గల వీడియో విడుదలైందని జమ్ముకాశ్మీర్ (JK) పోలీసులకు సంబంధించి సోషల్ మీడియా పేజీలో ‘ఎక్స్'(twitter) పోస్ట్ లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ ఈ వీడియోను ఒకరికొకరు షేర్ చేసుకోరాదని, సంబంధిత వీడియో అందినప్పుడు టెలిఫోన్ నెంబర్, డాటా, అందిన సమయం తమకు తెలియజేయాలని, ఆ సమాచారాన్ని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు వెంటనే తమ పై అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్లాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. జమ్మూలో ఇటీవల కాలంలో ఉగ్రదాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
“ఫాంటమ్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ డానియల్ పాత్రను పోషించాడు, భారతదేశంపై వరుస దాడులకు ప్రతిస్పందనగా భారతదేశం, యూరప్, అమెరికా మరియు మిడిల్ ఈస్ట్ అంతటా ఉన్న తీవ్రవాద సూత్రధారులను గుర్తించి, నిర్మూలించే లక్ష్యంతో పనిచేశారు. అతను ప్రతి లక్ష్యాన్ని అంతమొందించినప్పడు, మిషన్ గణనీయమైన వ్యక్తిగత నష్టాన్ని కలిగిస్తుందని డానియల్ తెలుసుకుంటాడు.”
ఈ సినిమాను అడ్డం పెట్టుకుని ఉగ్ర సంస్థ పెద్ద కుట్ర పన్నినట్లు తెలుస్తొంది. అందుకే జెకే పోలీసులు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూన్నారు.