560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్-చిరంజీవి
హైదరాబాద్: భారతదేశంకు స్వాతంత్ర్యం సిద్దించిన సమయానికి 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్,,మన దేశం ‘వన్ నేషన్’గా ఉందంటే అది మాజీ హోం మంత్రి,,పటేల్,,మనకు అందించిన ఒక గొప్ప వరం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు..శుక్రవారం భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘ (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీసులు ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించారు..
యూనిటీ ఇన్ డైవర్సిటీ:- ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హజరు అయ్యారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఈ మహత్తర కృషికి మనం ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలన్నారు..ఆయన ఇచ్చిన ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని,, ఇలా ఒక ర్యాలీ చేయడం ఇప్పుడున్న యువతకు, భావితరాలకు గొప్ప ప్రేరణ” అని పేర్కొన్నారు.. ఈ ‘రన్ ఫర్ యూనిటీ’ లో సుమారు 5000 మంది పౌరులు, రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు..ఈకార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి,,ఇతర పోలీసు అధికారులు,,పౌరులు పాల్గొన్నారు.

