పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం-వాతావరణశాఖ
అతిభారీ వర్షాలు…
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం,,, ‘ఫెంగల్ ‘ తుపానుగా బలపడి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది..’ఫెంగల్ ‘ తుఫాన్ ప్రస్తుతానికి పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం వుందన్నారు.. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో ఫెంగల్ కదులుతుందని వెల్లడించారు..శనివారం మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం వుందని పేర్కొన్నారు..దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో శుక్ర,,శనివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే ఆవకాశం వుందన్నారు..పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.