రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు తెలిపిన ప్రాజెక్ట్ అధికారులు
అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం రేపు శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు..జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను 880 అడుగులకు చేరిందని వెల్లడించారు..215 టీఎంసీలకు గాను 193 టీఎంసీలకు చేరుకుందని పేర్కొన్నారు..నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేయనున్న ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు..ప్రాజెక్టు గేట్లు ఎత్తి కృష్ణమ్మకు చీరసారెను సమర్పించి జలహారతి ఇవ్వడం ఆనవాయితీ.