ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
అమరావతి: నెల్లూరుజిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది..ప్రసన్న కుమార్ రెడ్డిని BNS 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది.
(నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను కోర్టు తప్పు పట్టింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అని మండిపడింది. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీసింది. అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేము అని న్యాయస్థానం స్పష్టం చేసింది.)