AP&TG

రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా కంపెనీల ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ

మూడు రోజుల పాటు దుబాయ్ లో..

అమరావతి: రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ఆస‌క్తి క‌న‌బ‌రిచాయి.ఈ మేర‌కు మంత్రి నారాయ‌ణ‌తో ఆయా కంపెనీల ప్ర‌తినిధులు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డుల సాధ‌న కోసం మంత్రి నారాయ‌ణ‌,అధికారుల బృందం మూడు రోజులుగా దుబాయ్ లో ప‌ర్య‌టించింది…వివిధ రంగాల‌కు చెందిన ప‌లు కంపెనీల పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశం అయ్యారు..రాష్ట్రంలో వ్యాపారాభివృద్దికి అనుకూల‌మైన అంశాల‌ను మంత్రి నారాయ‌ణ దుబాయ్ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు వివ‌రించారు.

మున్సిపాల్టీల్లో చెత్త సేక‌ర‌ణ,ప్రాసెసింగ్:- మూడో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం ఉద‌యం దుబాయ్ లోని షార్జా చాంబ‌ర్ కు వెళ్లిన మంత్రి నారాయ‌ణ‌. బీఆ(BEEAH)ఫెసిలిటీ కంపెనీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ లో ఉన్న మున్సిపాల్టీల్లో చెత్త సేక‌ర‌ణ,ప్రాసెసింగ్ చేస్తున్న విధానాన్ని బీఆ సంస్థ ప్ర‌తినిధులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా మంత్రికి వివ‌రించారు..ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మున్సిపాల్టీల‌ను డంపింగ్ ర‌హితంగా మార్చాల‌నే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్న అంశాన్ని మంత్రి నారాయ‌ణ కంపెనీ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు.రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ల ఏర్పాటుకు ముందుకు రావాలని బీఆ కంపెనీ ప్ర‌తినిధుల‌ను మంత్రి ఆహ్వానించారు..

రిజ‌ర్వాయ‌ర్లు,పంపింగ్ స్టేష‌న్లు:- టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ క‌న్స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ ఎండీ ఎస్ .ల‌క్ష్మ‌ణ్ తో మంత్రి నారాయ‌ణ‌,అధికారుల బృందం సమావేశ‌మ‌యింది. విద్యుత్,ఆయిల్,గ్యాస్ తో పాటు భారీ నిర్మాణాల ప్రాజెక్ట్ ల్లో ఈ కంపెనీకి 22 ఏళ్ల అనుభ‌వం ఉంది.రిజ‌ర్వాయ‌ర్లు,పంపింగ్ స్టేష‌న్లు,ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్ స్టేష‌న్ల నిర్మాణంలో ప్ర‌పంచంలో అనేక దేశాల్లో ప్రాజెక్ట్ లు చేప‌ట్టింది…ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో జ‌ర‌గుతున్న అభివృద్ది,గ‌త 15 నెల‌ల కాలంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప్రాజెక్ట్ ల వివ‌రాల‌తో పాటు అమ‌రావ‌తి నిర్మాణం గురించి టెక్టాన్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించారు.అమ‌రావ‌తి నిర్మాణంలో ప‌లు ప్రాజెక్ట్ ల నిర్మాణంలో భాగ‌స్వామ్యం కావాల‌ని మంత్రి కోరారు…ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు టెక్టాన్ కంపెనీ ఆస‌క్తి క‌న‌బ‌రిచింది.

నౌక‌ల నిర్మాణం,ఏవియేష‌న్ రంగాల్లో:- దుబాయ్ లోని కార్బోనాటిక్ (Carbonatik) కంపెనీ ప్ర‌తినిధుల‌తో మంత్రి స‌మావేశ‌మ‌య్యారు…అమెరికా కేంద్రంగా ఉన్న ఈ సంస్థ మైనింగ్,విద్యుత్ రంగాలతో పాటు షిప్ బిల్డింగ్,ఇన్ లాండ్ వాట‌ర్ వేస్,ఏవియేష‌న్ ప్రాజెక్ట్స్ లో ప్ర‌పంచ ప్ర‌సిద్దిగాంచింది. శ్రీలంక‌,జాంబియాతో పాటు 5 దేశాల్లో మైనింగ్ కార్య‌కలాపాలు నిర్వ‌హిస్తుంది..ఏపీలో నౌక‌ల నిర్మాణం,ఏవియేష‌న్ రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు కార్బోనాటిక్ సంస్థ ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. విశాఖ‌లో జరిగే భాగ‌స్వామ్య సద‌స్సుకు కంపెనీల ప్ర‌తినిధుల‌ను హాజ‌రుకావాల‌ని ఆహ్వానించారు. దుబాయ్ ప‌ర్య‌ట‌న ముగించుకుని బుధ‌వారం రాత్రికి మంత్రి నారాయ‌ణ బృందం హైద‌రాబాద్ చేరుకుంది…ఈ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి నారాయ‌ణ వెంట సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు,మున్సిప‌ల్ శాఖ డైరెక్ట‌ర్ సంప‌త్ కుమార్,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *