ఏ.పి టెట్-2025 ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP TET-2025) ఫలితాలను ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అభ్యర్థులు తమ మార్కుల మెమో, ఫలితాలను tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంటాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.గత సంవత్సరం డిసెంబర్ 10 నుంచి 21వ తేది వరకు జరిగిన టెట్ పరీక్షలకు మెుత్తం 2,48,427మంది అభ్యర్థులు హాజరు కాగా నేడు విడుదల చేసిన ఫలితాల్లో 47.82 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

