కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలిచింది-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: మేజర్ డ్రెయిన్ సమస్యకు 45 రోజుల్లో పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ తో వస్తామని చెప్పడం జరిగిందని,,35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునికీకరణకు అడుగులు వేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ముక్కోటి పర్వదినాన సమస్యకు పరిష్కారం చూపడం ఆనందంగా ఉందన్నారు.రైతుల ఆవేదన మనసుతో విని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందన్నారు.
రూ.20.77 కోట్లతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులను వర్చువల్ గా మంగళవారం ఉప ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,,రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు వున్నారు.

